Site icon NTV Telugu

Smoking in Marathon: వీడెవడండీ బాబూ.. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తాడు

Smoking And Running

Smoking And Running

Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్ నిర్వాహకులు ఈ ఈవెంట్ నిర్వహించారు. మొత్తం 1500 మంది ఈ రేసులో పాల్గొనగా చెన్ మాత్రమే మారథాన్‌లో స్మోక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్‌కు ఇలా స్మోక్ చేస్తూ పరిగెత్తడం తొలిసారి కాదు. 2018, 2019లో జరిగిన మారథాన్‌లలో కూడా ఇలాగే సిగరెట్ తాగుతూ పరిగెత్తాడు.

Read Also: Formula E-Racing: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు.. టిక్కెట్ ధర ఎంతంటే..?

కాగా చెన్ సిగరెట్ తాగుతూ పరిగెత్తే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్‌లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు చెన్ చర్యపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా మరికొందరు నెటిజన్‌లు మాత్రం ఇలా చేయడం తప్పు అంటూ మండిపడ్డారు. ధూమపానం చేయకపోతే చెన్ మరింత మెరుగ్గా రన్నింగ్ చేసేవాడు అని అభిప్రాయపడ్డారు. రన్నింగ్ ఆరోగ్యానికి మంచిది అని.. కానీ ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని.. ఈ రెండూ ఒకేసారి చేయడం వల్ల వ్యక్తిత్వం దెబ్బతింటుందని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం నికోటిన్ చెన్‌కు మంచి ఎనర్జీ ఇచ్చిందని.. అందుకే అతడు ఇలా పరిగెత్తాడని సెటైర్లు వేశారు. కాగా వేలమంది పాల్గొన్న ఈ మారథాన్ ఈవెంట్‌లో చెన్ 515వ ర్యాంక్ పొందినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది.

Exit mobile version