Site icon NTV Telugu

drown in Yamuna river: యమునా నదిలో పడి ఐదుగురు యువకులు మృతి

Yamuna River

Yamuna River

drown in Yamuna river: ఆదివారం కృష్ణుడి విగ్రహ నిమజ్జనం సందర్భంగా డీఎన్‌డీ ఫ్లైఓవర్ కింద యమునా నదిలో మునిగి ఐదుగురు యువకులు మరణించారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను అంకిత్ (20), లక్కీ (16) లలిత్ (17) బీరు (19), రీతూ రాజ్ అలియాస్ సాను (20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

Twin Towers Demolition: 9 సెకన్లలో ముగిసిన తొమ్మిదేళ్ల సుదీర్ఘ యుద్ధం.. కూల్చేశారు కానీ..

నిమజ్జనం అనంతరం నది మధ్యలో విగ్రహం చిక్కుకుపోయింది. అప్పుడు, ఆరుగురు అబ్బాయిలు నదిలోకి ప్రవేశించగా.. వారిలో ఒకరు మాత్రమే తిరిగి రాగలిగారు. ఐదుగురు అబ్బాయిలు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురు బాలుర మృతదేహాలను నది నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అందరూ గ్రేటర్ నోయిడాలోని సలార్‌పూర్ గ్రామ నివాసితులని పోలీసులు తెలిపారు.

Exit mobile version