Site icon NTV Telugu

Air India Express: ఉక్కపోతలో 5 గంటలు నరకం.. చుక్కలు చూపించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం..

Air India Express

Air India Express

Air India Express: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత కూడా దేశీయ విమానయాన సంస్థలు తీరు మార్చుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో అత్యంత వేడి వాతావరణంలో, ఏసీలు లేకుండా విమానంలో కూర్చోపెట్టారని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానంలో ఉక్కపోతలో 5 గంటలు నరకం అనుభవించామని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

Read Also: Zipline: జిప్‌లైన్ బెల్ట్ తెగి లోయలో పడిన బాలిక.. మనాలి ఘటన వైరల్..

విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో జూన్ 13న ఐదు గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 196 దుబాయ్ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌‌కు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వృద్ధులు, పిల్లలతో సహా ప్రయాణికులు ఉక్కపోతలో చెమటలు పడుతూ కనిపించారు. ఏసీలు పనిచేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

బయట ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ గా ఉందని ప్రయాణికులు తెలిపారు. రాత్రి 7.25 గంటలకు బయలుదేరాల్సిన విమానం, చివరకు అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరింది. క్యాబిన్ లోపల వేడి కారణంగా కొందరు వృద్ధుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రయాణికులు ఫిర్యాదులో ఆరోపించారు. ప్రయాణికులకు నీరు కూడా అందించలేదని ఆరోపించారు. ఎయిర్ లైన్ యాజమాన్యం,డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి ప్రయాణికులు జవాబుదారీతనం కోరుతున్నారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version