5 Bacteria Types Claimed 6.8 Lakh Lives In India In 2019: ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల 2019లో 77 లక్షల మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు రెండో అతిపెద్ద కారణం అవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియాతో ముడిపడి ఉందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 77 లక్షల మరణాలు సంభవిస్తే ఇందులో సగం మరణాలకు 33 రకాల బ్యాక్టీరియాలు కారణం అయ్యాయి. ఇందులో కేవలం ఐదు రకాలు బ్యాక్టీరియాలు మాత్రమే సగాని కన్నా ఎక్కవ మరణాలకు కారణం అయ్యాయని తేలింది.
Read Also: Imaran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
భారతదేశంలో 2019లో ఈ కోలి, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, ఎస్. ఆరియస్, ఏ. బౌమాని రకాలు అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా రకాలు 6,78,846 (దాదాపు 6.8 లక్షలు) మంది మరణాలకు కారణం అయ్యాయి. అత్యధికంగా ఈ కోలి బ్యాక్టీరియా 1,57,082 (1.57 లక్షలు) మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్లే ఎక్కువ మంది చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 8,64,000 మంది మరణిస్తే.. వీటి కన్నా ఎక్కువ మంది ఎస్. ఆరియస్, ఈ కోలీ బ్యాక్టీరియాల వల్ల మరణించారని అధ్యయనం వెల్లడించింది.
2019లో 1.37 కోట్ల వివిధ వ్యాధులతో మంది మరణిస్తే, ఇందులో 77 లక్షల మంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో మరణించారు. 77 లక్షల మంది మరణాల్లో 75 శాతం మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు, పెరిటోనియల్ మరియు ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్ల వల్లే మరణించినట్లు తేలింది. ఎస్.ఆరియస్, ఈ కోలీ, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, పీ. ఎరుగినోసా బ్యాక్టీరియాల వల్ల 54.2 శాతం మరణాలకు కారణంగా తేలింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఎస్. ఆరియస్ వల్ల 10 లక్షల మరణాలు నమోదు అయ్యాయి. అయితే వయసును బట్టి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల తీరు మారుతోంది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఎస్. ఆరియస్ బ్యాక్టీరియా ఎక్కువ మరణాలకు కారణం అయితే 5-14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్లో సాల్మొనెల్ల ఎంటెరికా సెరోవర్ టైఫీతో ఎక్కువ మంది మరణించినట్లు స్టడీలో తేలింది.