NTV Telugu Site icon

Delhi: మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి

Delhibusaccident

Delhibusaccident

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పంజాబీ బాగ్‌లోని రోహ్‌తక్‌ రోడ్డులోని శివాజీ పార్క్‌ సమీపంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మెట్రో పిల్లర్‌ను ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి ఉదయం 7.42 గంటలకు పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విచిత్ర వీర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మంగోల్‌పురి-ఆనంద్ విహార్ మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఆ ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పైకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఆటో రిక్షా ఢీకొట్టింది.

ఇది కూడా చదవండి: CM Revanth: రాహుల్ గాంధీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?

ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 55 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన 24 మంది ప్రయాణికుల్లో 14 మందిని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి, మరో 10 మందిని ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్, ఒకరి మరణానికి కారణమైనందుకు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశామని, క్రైమ్ టీమ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించి, ఫోరెన్సిక్ శాంపిల్స్ తీసుకుంటున్నామని పోలీసు అధికారి తెలిపారు. బస్సులో మెకానికల్ తనిఖీలు కూడా జరుగుతున్నాయని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Nathanadhudu : భీముడి వారసుడు నాథనాధుడిగా శరత్ కుమార్ లుక్ చూశారా?