NTV Telugu Site icon

Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

Karnataka Accident

Karnataka Accident

పుట్టినరోజు వేడుకలకు వెళ్లివస్తుండగా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కారు అతివేగంగా ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఐదుగురిలో నలుగురు మహిళలే. కర్ణాటక లోని కుకనూర్‌ తాలూకా బిన్యాల్‌ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్‌ తన కుటుంబంతో కలిసి కొప్పల్‌ లోని తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. నిన్న శనివారం రాత్రికి తిరగివస్తుండగా వారు ప్రయాణం చేస్తున్న కారు కుకనూర్‌ భానుపుర్‌ వద్దకు రాగా అతివేగంగా వెల్లి అక్కడే వున్న ట్రక్కును ఢీ కొట్టంది. ఈ ఘటన రాత్రి సుమారు 10 గంటల సమయంలో జరిగింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

read also: Monkeypox: ఇండియాలో మరో మంకీపాక్స్ కేసు.. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తిలో వైరస్ గుర్తింపు

ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా సమీపంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. మరో ముగ్గరు గాయపడ్డారు. పోలీసు సిబ్బంది కర్ణాటక బెంగళూరులోని శివాజీనగర్​ పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. డ్రగ్స్​ విక్రయించే ఓ వ్యాపారి చిత్తూరులో ఉన్నాడన్న సమాచారంతో.. అతడిని పట్టుకునేందుకు వెళ్తుండగా కారు డివైడర్​ను ఢీకొట్టడంతో.. ముగ్గరు పోలీసులు ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాలను, క్షతగాత్రులను బెంగళూరుకు తరలించారు.

Droupadi Murmu: రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం