Site icon NTV Telugu

JK: జమ్మూకాశ్మీర్‌ లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి

J&k

J&k

జమ్మూకాశ్మీర్‌లోని బందీపోర్‌లో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ సైనికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జమ్మూకాశ్మీర్‌లోని ఎస్‌కే పాయెన్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Pani Puri: “పవర్ ఆఫ్ పానీపూరీ”.. ఏడాదిలో రూ. 40 లక్షల చెల్లింపులు.. జీఎస్టీ నోటీసులు..

ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్మీ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. అమరవీరులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నానని, గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమావేశం.. కీలక ఆదేశాలు

Exit mobile version