NTV Telugu Site icon

Indore: రామనవమి రోజున అపశృతి.. ఆలయం మెట్లబావిలో పడి నలుగురు మృతి..

Indore

Indore

30 people fell into a stepwell at an Indore temple: శ్రీరామ నవమి రోజుల విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. శ్రీరామ నవమి కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో మెట్లబావిపై ఉన్న ఫ్లోర్ కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అందులో పడిపోయారు. మొత్తం 30 మంది బావిలో పడిపోయారు. ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. 17 మందిని అధికారులు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Read Also: North Korea: సినిమా చూసినా, మతాన్ని అనుసరించినా ఉరి శిక్షే గతి.. కిమ్ నియంతృత్వంలో అరాచకం

మరణించిన నలుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరణాలను ఇండోర్ పోలీస్ చీఫ్ మకరంద్ దేవస్కర్ ధ్రువీకరించారు. తాళ్లు, నిచ్చెనల సహాయంతో బాధితులను బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారిని కూడా సుక్షితంగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండోర్ లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగిందని, సీఎం శివరాజ్ సింగ్ తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నానని, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండోర్ కలెక్టర్ టి రాజా మాట్లాడుతూ.. రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.