NTV Telugu Site icon

Gujarat: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్..

Gujarat

Gujarat

Gujarat: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) మాడ్యూల్‌ను గుజరాత్ ఏటీఎస్ ఛేదించింది. పోర్ బండర్, సూరత్ ప్రాంతాల్లో మూడు చోట్ల ఆపరేషన్ నిర్వహించి ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన యాంటీ టెర్రిరస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) పోర్ బందర్ లో ముగ్గురిని, సూరత్ లో ఒక మహిళను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్ డీజీపీ వికాస్ సహాయ తెలిపారు.

ముగ్గురు వ్యక్తులు పోర్ బందర్ నుంచి ఒక ఫిషింగ్ బోట్ ను ఉపయోగించి అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని ఇస్లామిక్ స్టేట్ లో చేరాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం వారిని పోర్ బందర్ నుంచి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. శ్రీనగర్ కు చెందిన ఉబేద్ నాసిర్ మీర్, హనన్ హయత్ షోల్, మహ్మద్ హజీమ్ షాగా గుర్తించామని వెల్లడించారు. అబూ హంజా అనే హ్యాండ్లర్ ద్వారా వీరంతా శిక్షణ పొందారని పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌కు చెందిన జుబేర్ అహ్మద్ మున్షీ, సూరత్‌కు చెందిన సుమేరా బాను, హనీఫ్ మాలెక్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ISKP మాడ్యూల్‌లో సభ్యులుగా ఉన్నారని, ప్రస్తుతం అరెస్ట్ అయిన వారికి వారితో సబంధాలు ఉన్నాయి ఏటీఎస్ తెలిపింది.

Read Also: Petrol Rates: పెట్రోల్, డిజిల్ రేట్ల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏమన్నారంటే..

ఆపరేషన్ సమయంలో ‘వాయిస్ ఆఫ్ ఖోరాసన్’ అనే రాడికల్ ప్రచురణలను స్వాధీనం చేసుకున్నారు. సుమేరా బాను తన హ్యాండ్లర్లతో టచ్ లో ఉందని, జుబేర్ తో సన్నిహిత సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. పోర్‌బందర్‌లో అదుపులోకి తీసుకున్న ముగ్గురి నుంచి వారి వ్యక్తిగత గుర్తింపులకు సంబంధించిన పలు పత్రాలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, పదునైన ఆయుధాలు వంటి డిజిటల్ కమ్యూనికేషన్‌కు ఉపయోగించే మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు.

పోర్‌బందర్‌కు చేరుకుని ఫిషింగ్ బోట్‌లో మత్స్యకారులుగా చేరాలని, బోట్ కెప్టెన్‌ను ఉపయోగించి ఇచ్చిన GPS కోఆర్డినేట్‌లను చేరుకోవాలని ముగ్గురిని వారి హ్యాండ్లర్ అబు హమ్జా ఆదేశించారని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి ఇరాన్ తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ కు నకిలీ పాస్ పోర్టులు అందించి హెరాత్ మీదుగా ఖొరాసన్ చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఏటీఎస్, సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ప్రశంసించారు.