Site icon NTV Telugu

Earthquake: పంజాబ్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి

Earthquake

Earthquake

4.1 Magnitude Earthquake Hits Punjab Days After Tremors In Delhi: వరసగా భూకంపాలు, భూప్రకంపనలు దేశవాసులను కలవరపెడుతున్నాయి. ఇటీవల రోజుల వ్యవధిలోనే ఢిల్లీతో పాటు పలు హిమాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్ లో వస్తున్న భూకంపాలు ధాటికి ఢిల్లీ నగరం వణికిపోతోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. తెల్లవారుజామున 3.42 గంటలకు 4.1 తీవ్రతతో పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ భూకంపం వచ్చింది.

Read Also: Afghanistan: మహిళలకు తాలిబాన్ సర్కార్ కొత్త రూల్.. ఇకపై అక్కడికి వెళ్లకుండా నిషేధం

భూమి నుంచి 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అమృత్ సర్ నగరానికి 145 కిలోమీటర్ల భూకంప కేంద్ర ఉంది. ఇటీవల బుధవారం, శనివారాల్లో ఢిల్లీలో భూప్రకంపలను వచ్చాయి. నేపాల్ దేశంలో వచ్చిన భూకంపాల కారణంగా ఉత్తరాఖండ్, ఢిల్లీ ఇతర పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు బుధవారం కూడా నేపాల్ లో 6 తీవ్రతతో భూకంపం వచ్చింది.

హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భూమి కింద టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువ అవడంతో ఆ శక్తి భూకంపాలుగా వస్తున్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం వైపుగా కదులుతూ.. ఆసియా ప్లేట్ ను నెట్టేస్తోంది. దీని కారణంగా హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు వస్తున్నాయి.

Exit mobile version