Site icon NTV Telugu

Maoists Surrender : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Maoists

Maoists

Maoists Surrender : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు కూడా ఆయుధాలు వదిలి ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలుపుతూ లొంగిపోయారు.

Drunken Drive : చుక్కేసి చిక్కితే.. చిక్కులే !

దక్షిణ బస్తార్‌లో మావోయిస్టుల ప్రాబల్యం గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతుండగా, ఈ భారీ లొంగుబాటు ఆ ప్రక్రియకు మరింత వేగం తీసుకొచ్చిందని అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులు గతంలో పలు కీలక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గోంపడ్, జంగంపాల్, గుడ్రూమ్ పరిసర ప్రాంతాల్లో మావో చట్రవృత్తుల్లో పాల్గొంటూ భద్రతాబలగాల కదలికలను గమనించడం, 2019, 2020ల్లో పోలీసులు, భద్రతా బలగాలపై దాడులు, కాల్పులు, అలాగే IEDలు అమర్చడం వంటి ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది.

మావోయిస్టు కార్యకలాపాలు తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి- ప్రేరిత కార్యక్రమాల ప్రభావంతో పాటు, పోలీసుల నిరంతర ఆపరేషన్లు కూడా ఈ లొంగుబాట్లకు కారణమని అధికారులు చెబుతున్నారు. దక్షిణ బస్తార్‌లో శాంతి స్థాపనకు ఈ లొంగుబాటు ఒక పెద్ద అడుగుగా భావిస్తూ, భవిష్యత్తులో మరిన్ని మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి వస్తారని భద్రతా బలగాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

MLA Anirudh Reddy: తెలంగాణ వ్యాఖ్యలుపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి !

Exit mobile version