Dead Rat In Food: ఇకపై ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్‌కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచి క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ ఆర్డర్ చేశాడు.
ఆకలితో ఉన్న అతను ఫుడ్ రాగానే తినడం ప్రారంభించాడు. అయితే, కొద్ది సమయానికి కర్రీలో ఎలుక, బొద్ధింక ఉండటాన్ని గమనించాడు. దాల్ మఖానిలో చనిపోయిన ఎలుక ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే శుక్లా తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.
Read Also: Allu Arha: క్లింకారా తో అల్లు అర్హ డ్యాన్స్.. ఎంత క్యూట్ గా చేసిందో చూడండి..
‘‘ తాను ముంబై చూసేందుకు ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చానని. ఇదే నా చివరి ప్రయాణం కావచ్చు, నేను బ్రహ్మణుడిని, స్వచ్ఛమైన శాఖాహారిని, కానీ బర్బెక్యూ నేషన్ ఆర్డర్ చూనినప్పుడు నేను నా ప్రాణం పోయినట్లు షాక్ అయ్యాను. ఆహారంలో చనిపోయిన ఎలుక, బొద్దింక ఉన్నాయి. నేను ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడ్డాను. నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందాను’’ అని చెప్పాడు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా బార్చెక్యూ నేషన్‌కి కల్తీ ఆహారం గురించి పంపాను. నేను శాఖాహారిని, దీన్ని భరించలేకపోతున్నాను, అప్పటికే వాంతి చేసుకున్నాను, నా తలలో ఇదే నిరంతరం తిరుగుతోంది, వికారం అనిపిస్తోంది. ఫుడ్ బిజినెస్ మనల్ని బతికించడం కానీ చంపడం కాదని ఎలుక ఉన్న ఫుడ్ ఫోటోలను పంచుకుంటూ శుక్లా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని తెలిపారు.
రాజీవ్ శుక్లా కంప్లైంట్‌పై సదరు రెస్టారెంట్ మేనేజర్ స్పందించారు. ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. దీనిపై సంప్రదింపులు జరుపుతామని, సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది. ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత బార్బెక్యూ నేషన్ యజమాని, మేనేజర్, చెఫ్‌లపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.