NTV Telugu Site icon

Wayanad landslides: 344కి చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Wayanad

Wayanad

Wayanad landslides: 344కి చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం సెర్చ్..ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా కూడా విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మరణించిన వారి సంఖ్య 344కి చేరింది. ఇంకా 200 మందికి పైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలంలో పోటీ పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇళ్లలో ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా..? అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డీప్ సెర్చ్ రాడార్ ఉపయోగించి చిక్కుకుపోయిన వారిని కనుగొనే ప్రయత్నం జరుగుతోంది.

Read Also: Virl Video: విమానాశ్రయంలో మహిళ బట్టలు విప్పి వీరంగం..వీడియో వైరల్

భారీ వర్షాల కారణంగా, ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్ జిల్లా వైత్తిరి తాలుకాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఒక్కసారిగా బురద, రాళ్లతో కూడిన వరద ఊళ్లపై పడింది. దీంతో చాలా వరకు ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. నదీ ప్రవాహం దిశను మార్చుకోవడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముండక్కై, చూరల్‌మల గ్రామాలు నది ఒడ్డునే ఉండటంతో ఎక్కువ మంది మరణించారు.