NTV Telugu Site icon

Italy: బానిస బతుకు నుంచి 33 మంది భారతీయ కార్మికులకు విముక్తి..

Indians In Italy

Indians In Italy

Italy: ఇటలీలో అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య బానిసత్వంలో మగ్గుతున్న 33 మంది భారతీయ వ్యవసాయ కార్మికులకు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో భారతీయ వ్యవసాయ కూలీలను బానిసలు వంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినట్లు ఇటాలియన్ పోలీసులు శనివారం తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వీరిని దుర్వినియోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఆరు మిలియన్ యూరోలు ($545,300) స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో జరిగిన ప్రమాదంతో ఒక కార్మికుడి చేయి పండ్లను కోసే యంత్రంలో పడి మరణించాడు. ఈ ఘటన చాలా చర్చనీయాంశమైంది.

Read Also: Pakistan: కీబోర్డుతో కారు నడిపిన పాక్ కుర్రాడు..

తాజా కేసులో, గ్యాంగ్ మాస్టర్లు భారత్ ననుంచి సీజనల్ వర్క్ పర్మిట్‌లపై భారతీయులను ఇటలీకి తీసుకువచ్చారు. ఒక్కొక్కరికి 17,000 యూరోలు చెల్లిస్తామని, వారికి మంచి సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వలస వచ్చిన వారికి వ్యవసాయ పనుల్లో పెట్టారు. వారికి ఏడు రోజులు రోజుకు 10-12 గంటల పాటు పనిచేయించడంతో పాటు కేవలం గంటకు 4 యూరోలు మాత్రమే ఇచ్చారు. పూర్తిగా తమ అప్పులు తీర్చే వరకు బానిసలుగా పనిచేయిస్తున్నారు.

శాశ్వత వర్క్ పర్మిట్ కోసం అదనంగా 13,000 యూరోలు చెల్లించడానికి ఉచితంగా పనిని కొనసాగించమని చెప్పారు. అయితే ఇది తప్పు అని పోలీసుల ప్రకటన తెలిపింది. వీరిపై బానిసత్వం, శ్రమదోపిడి సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితులకు రక్షణ, పని అవకాశాలు, చట్టపరమైన నివాస పత్రాలు అందించబడుతాయని పోలీసులు తెలిపారు.