Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 32 Cars Bombs And A Deadly Plot The Red Fort Terror Conspiracy Uncovered

Delhi Car Blast: 32 కార్లతో “బాబ్రీ మసీదు” కూల్చివేతకు ప్రతీకార కుట్ర..

Published Date :November 13, 2025 , 3:28 pm
By Venu Goapl Reddy
  • 32 కార్లతో విధ్వంసానికి కుట్ర..
  • డిసెంబర్ 6, బాబ్రీ కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్..
  • ఢిల్లీలోని 6 ప్రాంతాల్లో వరస పేలుళ్లకు కుట్ర..
  • ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్‌లో సంచలన విషయాలు..
Delhi Car Blast: 32 కార్లతో “బాబ్రీ మసీదు” కూల్చివేతకు ప్రతీకార కుట్ర..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి.

Read Also: Pakistan: భారత్, ఆఫ్ఘాన్‌లతో యుద్ధానికి సిద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Also Read

  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
  • Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
  • Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
  • DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే, ఈ కేసులో పెద్ద కుట్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 6, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. దీని కోసం 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆరు దశల్లో ఒకేసారి బాంబు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఢిల్లీలోని ఆరు వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడులకు పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. బ్రెజ్జా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్ కార్లను పోలీసులు గుర్తించారు. సోమవారం దాడి సమయంలో హ్యుందాయ్ ఐ20కారును ఉపయోగించారు. పోలీసులకు ట్రేస్ చేసినా దొరకుండా ఎక్కువ సార్లు చేతులు మారిన కార్లను ఉగ్ర డాక్టర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు హర్యానా ఫరీదాబాద్‌లో గుర్తించారు. బ్రెజ్జా కారును మహిళా వైద్యురాలు షాహినా సయీద్ వాడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈమెనే జైషే మహ్మద్ ఉగ్రసంస్థ మహిళా విభాగానికి ఇండియాలో హెడ్‌గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బ్రెజ్జా కారును హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్‌లో గుర్తించారు. ఈ కేసులో ఉగ్రవాద డాక్టర్లు- ఆదిల్ అహ్మద్ రాథర్‌, ముజమ్మిల్ షకీల్, సాహినా సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • babri masjid
  • Delhi car blast
  • Delhi terror attack
  • Delhi terrorist attack
  • Faridabad

తాజావార్తలు

  • Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్

  • Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions