ఢిల్లీలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది.. వచ్చే ఏడాది పంజాబాద్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే సిద్ధం అవుతోంది.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనేది హామీ కూడా ఇస్తున్నారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… పంజాబ్ ఎన్నికల్లో తాము గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలీలకు కూడా మాఫీ చేస్తామని.. 24 గంటల కరెంటు ఇస్తామని వెల్లడించారు.. ఇక, ఢిల్లీలో గతంలో ఉన్న పరిస్థితులు.. ఇప్పుడు అమలు జరుగుతున్నది ఉదాహరణగా చూపారు కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలిసారి 2013లో ఆప్ పోటీ చేసిన సమయంలోనూ అప్పటి ప్రభుత్వాల హయాంలో భారీగా కరెంటు బిల్లులు వచ్చేవని.. విద్యుత్ సంస్థలతో ప్రభుత్వాలు కుమ్మక్కవడంలో ఈ పరిస్థితి ఉండేదన్న ఆయన.. పంజాబ్‌లోనూ అదే జరుగుతోందని.. కానీ, ఆ పరిస్థితికి తాము ఢిల్లీలో చెక్ పెట్టాం.. పంజాబ్‌లో అధికారంలోకి రాగానే అదే పని చేస్తామన్నారు.
మేం గెలిస్తే అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..

Arvind Kejriwal