Site icon NTV Telugu

Chennai: గ్యాస్ లీకేజ్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత..

Chennai School

Chennai School

Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాస్ లీకేజ్ కారణంగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. త్తర చెన్నైలోని తిరువొత్తియూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు శుక్రవారం రోజు, అనుమానాస్పద గ్యాస్ లీక్ కారణంగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, వికారం వంటి లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో.. ప్రధానంగా పాఠశాల మూడో అంతస్తులోని 8-10 తరగతి విద్యార్థులే ఎక్కువగా ప్రభావితమయ్యారు.

Read Also: Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపుగా 30 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వారంతా ఇప్పుడు బాగానే ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు మొదట ఏదో ఘాటైన వాసన వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. ఆ తర్వాత మైకము, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. తక్షణమే వైద్య సాయం కోసం పాఠశాల అధికారులు చర్యలు తీసుకున్నారు.

ప్రారంభంలో, లీకు కెమెస్ట్రీ ల్యాబ్ నుంచి ఉండొచ్చని అనుమానించారు. అయితే, ఈ ఘాటైన వాననకు గల కారనాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దీని గురించి తెలుసుకునేందుకు పోలీసులు పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాధిత విద్యార్థుల పరిస్థితిని అంచనా వేయడానికి సీనియర్ పోలీస్ అధికారులు ప్రస్తుతం పాఠశాల మైదానాలను మరియు ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version