UP Shocker: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో విషాదకర సంఘటన జరిగింది. పిల్లలు బెలూన్లతో సరదాగా ఆడుకుంటారు, అయితే ఈ బెలూన్ 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. బాలిక బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఆమె మరణించింది. పేలిన బెలూన్ బాలిక గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు విడిచింది.
Read Also: Delhi: రేపు ఢిల్లీలో కౌటిల్య ఆర్థిక సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రయాగ్‌రాజ్‌లోని నవాబ్‌గంజ్‌లో చిన్నారి తన తాత ఇంటికి వెళ్లిన సందర్భంలోఈ ఘటన చోటు చేసుకుంది. తాత ఇచ్చిన బెలూన్‌తో చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా పగిలిపోయిందని బాలిక సైరా తల్లి తెలిపింది. వెంటనే సైరా కుప్పకూలిందని, ఆమె నోటి నుంచి నురగ రావడం మొదలైందని వెల్లడించింది. వెంటనే చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిన శ్వాసనాళంలో బెలూన్ ముక్కలు ఇరుక్కుపోవడే మరణానికి కారణమని వైద్యులు చెప్పారు.
సాధారణంగా పిల్లలు బెలూన్‌లో గాలి నింపే సమయంలో తరుచుగా బెలూన్ పేలితే వాటి ముక్కలు వారి నోటిలోకి చేరుతాయని, అనుకోకుండా వాటి భాగాలు వాయునాళంలోకి చేరితే ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లల శ్వాసనాళాలు ఇరుకైనవిగా, చిన్నవిగా ఉంటాయని ఇది ప్రమాదాన్ని మరింతగా పెంచుతుందని చెప్పారు.