POCSO Case: మహిళలు, బాలికను అసభ్యం తాకడమే కాదు, వారిని ఉద్దేశించి అనుచితంగా కామెంట్స్ చేసినా కూడా నేరం కిందే పరిగణించబడుతుంది. అవి కూడా లైంగిక వేధింపులగానే భావించబడుతాయి. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ మైనర్ బాలికను అనుచితంగా తాకి, ‘‘హాట్’’ అంటూ కామెంట్ చేసినందుకు 50 ఏళ్ల వ్యక్తికి ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నేరం రుజువైంది.
Read Also: North Korea: “అదే జరిగితే కిమ్ పాలన అంతం అవుతుంది”.. నార్త్ కొరియాకు అమెరికా వార్నింగ్..
ప్రత్యేక పోక్సో కోర్టు జడ్డి ఎస్పీ జాదవ్, డిసెంబర్ 14న నిందితుడిని ఐపీసీ సెక్షన్లతో పాటు, పిల్లలకు లైంగిక నేరాల నుంచి రక్షణగా నిలిచే పోక్సో చట్టం కింద దోషిగా నిర్ధారించారు. ఈ కేసు మే 24,2016న జరిగింది. నేరం జరిగిన సమయంలో బాధిత బాలిక వయసు 13 ఏళ్లు. బాధితురాలు తన స్నేహితడితో కలిసి మసీదు వద్ద నిలబడి ఉండగా.. నిందితుడు ఆమెను అనుచిత ప్రాంతంలో తాకినట్లు నేరం రుజువైందని కోర్టు తెలిపింది.
ఆమె చాలా ‘‘హాట్’’గా కనిపించిందని, ఆమె బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలని, ఆమెను తనతో తీసుకెళ్లాలని భావిస్తున్నానని చెడు ఉద్దేశంతో కామెంట్స్ చేశాడు. బాలికను అనుచితంగా తాకడం, లైంగిక పరమైన మాటలతో వేధించడం వల్ల నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది.
