NTV Telugu Site icon

Noida: గర్ల్‌ఫ్రెండ్‌‌ను ప్రియుడు కారులో తిప్పాలనుకున్నాడు.. స్నేహితులు ఏం చేశారంటే..!

Noida

Noida

ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: ICICI Bank: క్రెడిట్‌ కార్డుదారులకు షాక్‌.. లావాదేవీలపై కీలక మార్పులు

ప్రియురాలిని కారులో బయటకు తీసుకెళ్లాలనుకున్నాడు ప్రియుడు. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంకేముంది కారును దొంగిలించి డ్రైవ్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. స్నేహితుడి లవర్‌ కోసం ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కొత్త కారును దొంగలించారు. షోరూమ్‌ నుంచి మగ్గురు స్నేహితులు శ్రేయ్‌, అనికేత్‌ నగర్‌, దీపాంశు భాటీ కొత్త కారును దొంగిలించారు.

 

సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్‌లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని డీలర్ అడిగారు. వారు హెల్మెట్‌లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు. అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: Vijayawada: పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం.. హాజరైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Show comments