Site icon NTV Telugu

Delhi Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు, మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్..

Delhi Car Blast9

Delhi Car Blast9

Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట్ కార్ బాంబు దాడి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ధౌజ్, నుహ్, దాని పరిసర ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలు శుక్రవారం రాత్రి సమన్వయ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్లు – మొహమ్మద్, ముస్తాకిమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి వీరిద్దరు సన్నిహితులు. అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్ గనైతో వీరిద్దరు సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: PMK Chief Anbumani: కుల గణన చేయడంలో స్టాలిన్ ఫెయిల్.. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్న టీవీకే!

అరెస్ట్ చేయబడిన వైద్యుల్లో ఒకరు పేలుడు జరిగిన రోజు ఢిల్లీలోనే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎయిమ్స్ ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ గనైతో మొహమ్మద్, ముస్తాకిన్ సంబంధాలు, ఢిల్లీ పేలుడులో వీరిద్దరి పాత్ర ఉందా.? అని విచారణ జరుగుతోంది. మరోవైపు, లైసెన్స్ లేకుండా ఎరువులు అమ్మినందుకు దినేష్ అలియాస్ డబ్బూ అనే వ్యక్తిని కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.

ఇదిలా ఉంటే, పఠాన్ కోట్‌కు చెందిన వైద్యుడు, సర్జన్ అయిన అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు శనివారం దర్యాప్తు అధికారులు తెలిపారు. 45 ఏళ్ల సర్జన్ రెండేళ్లకు పైగా పఠాన్ కోట్ లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో పనిచేసినట్లు తెలిపారు. ఇతను గతంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో కూడా పనిచేశాడు. సోమవారం, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. డాక్టర్ ఉమర్ నబీ కారు నడుపుతూ, ఆత్మాహుతికి పాల్పడినట్లు తేలింది. ఈ సంఘటన తర్వాత 8 మందితో పాటు అనేక మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version