Site icon NTV Telugu

Jammu Kashmir: ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..

Pakistan

Pakistan

Jammu Kashmir: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నుంచి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(LeT)తో సంబంధం ఉన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరాలోని చెక్‌పాయింట్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. గరూరా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్ రౌండ్లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి.

Read Also: Sri Krishna Devarayalu: జాతీయ భద్రతపై ఏ చర్యలు తీసుకున్నా టీడీపీ సహకరిస్తుంది

మంగళవారం, పహల్గామ్ బైసరన్ పచ్చిక మైదానాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(ఆర్టీఎఫ్)’’ ప్రకటించింది.

Exit mobile version