Site icon NTV Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోల హతం.. మృతుల్లో అగ్రనేత!

Chhattisgarhencounter

Chhattisgarhencounter

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో అడవులు దద్దరిల్లాయి. మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు బుధవారం కూడా మావోల కోసం జల్లెడ పట్టాయి. దీంతో నారాయణపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలకు మావోలు ఎదురుపడ్డారు. దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలయ్యాయి. మాధ్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Roop Kumar Yadav: పుష్ప మూవీలో మంగళం శ్రీను లాంటి వ్యక్తి..! మాజీ మంత్రి అనిల్‌పై రూప్‌ కుమార్‌ సెటైర్లు..

ఇటీవల మావోలకు నిలయమైన కర్రెగట్టులో ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో అనేక మంది మావోలు హతమయ్యారు. అనంతరం జవాన్లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మావోల ఏరివేతలో విజయం సాధించినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్

Exit mobile version