Site icon NTV Telugu

Breaking News: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 27 మంది మృతి..

Up

Up

Breaking News: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 27 మంది మరణించారు. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు.

తొక్కిసలాటలో చనిపోయని 27 మందిలో 25 మంది మహిళలే ఉన్నారు. రతీభాన్‌పూర్‌లో శివుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరంతా వచ్చారు. కార్యక్రమం ముగియగానే తొక్కిసలాట జరగడంతో మహిళలు, చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. మొత్తం 15 మంది మహిళలు మరియు పిల్లలను ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.

Exit mobile version