NTV Telugu Site icon

JN.1 Cases: దేశవ్యాప్తంగా 263 కోవిడ్ JN.1 కేసులు.. ఒక్కరాష్ట్రంలోనే సగం కేసులు..

Covid Sub Variant Jn.1

Covid Sub Variant Jn.1

JN.1 Cases: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసుల్లో పెరుగుదల కూడా కలవరపరుస్తోంది. ఇన్సాకాగ్(INSACOG) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 263 JN.1 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కేరళలోనే నమోదయ్యాయి.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. కేరళ (133), గోవా (51), గుజరాత్ (34), ఢిల్లీ (16), కర్ణాటక (8), మహారాష్ట్ర (9), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1) చొప్పున కేసులు నమోదైనట్లు ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా వెల్లడించింది. ఈ కేసుల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే 239 కేసులు నమోదవ్వగా.. నవంబర్ నెలలో 24 వెలుగులోకి వచ్చాయి.

Read Also: ICU Admit: రోగిని ఐసీయూలో అడ్మిట్ చేర్చుకోవడంపై కొత్త మార్గదర్శకాలు.. ఇక వారి అనుమతి కీలకం..

అయితే, ఈ JN.1 కోవిడ్ వేరియంట్ పెద్దగా ప్రమాదకరమైనది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. కరోనా వైరస్ JN.1 సబ్-వేరియంట్, BA.2.86 ఉప-వంశంలో భాగంగా ఉంది. దీనిని డబ్ల్యూహెచ్ఓ “వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్(VOI)”గా అభివర్ణించింది. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 573 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసులు 4,565 గా ఉన్నాయి.

Show comments