Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు. అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు. కాగా, 2019 మేలో మక్కీని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 2020లో పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక కోర్టు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో అతనిని దోషిగా నిర్ధారించడంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Read Also: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో భారత్!
అలాగే, 26/11 ముంబై టెర్రర్ దాడులకు ఆర్థిక సహాయం అందించడంలో హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ కీలక పాత్ర పోషించారు. దీంతో 2023లో మక్కీని ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించింది. దీంతో అతడి ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. జూడి కార్యకలాపాల ముసుగులో మిలిటెంట్ కార్యకలాపాలకు నిధుల సమీకరణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు రావడంతోనే ఈ చర్యలు తీసుకుంది.