Diabetes: రోజు రోజుకి శారీరక శ్రమ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో రోగాలు పెరిగిపోతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో చక్కెర వ్యాధి ఉన్న వారు ప్రస్తుతం 10 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారినడపతున్నారు. ప్రస్తుత జీవన విధానంలో 25 సంవత్సరాల లోపు వారికి కూడా మధుమేహం వస్తోంది. కొన్ని సందర్బాల్లో 15 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా మధుమేహం వస్తోంది. మధుమేహంతో బాధ పడుతున్న వారు వారి సంపాదనలో 25 శాతం డయాబెటిస్ వైద్యానికే ఖర్చు చేస్తున్నారని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది.
Read also: Sai Chand: సింగర్ సాయి చంద్ మృతిపై ప్రముఖుల సంతాపం
డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సుమారు 25 శాతం ఔషధాల కొనుగోలు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో 25 ఏండ్ల లోపువారికి కూడా డయాబెటిస్ వస్తున్నదని అనేక సర్వేల్లో బయటపడుతోంది. పని సామర్థ్యం తగ్గిపోవటమే డయాబెటిక్‌కు ప్రధాన కారణం. దేశంలో డయాబెటిక్ రోగులు పది కోట్లు దాటారు. మూడు నాలుగేండ్లలో వీరికి మరో 13 కోట్ల మంది జత కలుస్తారని ఐసీఎంఆర్ 12 ఏండ్లపాటు నిర్వహించిన పరిశోధనలో తేల్చింది. డయాబెటిక్ రోగులకు తోడు దేశంలో 30 కోట్లకుపైగా బ్లడ్ ప్రెషన్ (బీపీ) రోగులున్నారు. భారతదేశంలో 2022 నాటికి 10.01 కోట్ల డయబెటిస్ రోగులున్నారు. డయాబెటిస్‌పై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. దాంతో ఆ మహమ్మారి బారిన పడిన విషయం కూడా తెలియకుండా చాలామంది జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యాధి ముదిరి కళ్లు, గుండె, మూత్రపిండాలను దెబ్బతిన్న తర్వాతగానీ అసలు కారణం తెలుసుకోలేకపోతున్నారు. దీని మూలంగా వైద్య ఖర్చుల భారం మరింత పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
Read also: Sarvajit Laxman Century: హైదరాబాద్ నుంచి.. మరో క్రికెటర్ తనయుడు వచ్చేస్తున్నాడు!
డయాబెటిస్ వల్ల ప్రజల ఆరోగ్యంతోపాటు డబ్బుకూడా కరిగిపోతున్నది. ప్రపంచంలో డయాబెటిస్ రోగులు తమ వైద్యం, ఔషధాల కోసం చేస్తున్న వ్యయం విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. జర్నల్ ఆఫ్ హెల్త్ ఎకనామిక్స్ అండ్ ఔట్‌కమ్స్ రిసెర్చ్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం భారత్‌లో 2017లోనే డయాబెటిస్ వైద్యం కోసం రూ.2.54 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దేశీయ డయాబెటిక్ మందుల మార్కెట్ దీని విలువ రూ.16,769 కోట్లు ఉన్నది. డయాబెటిస్ బారిన పడినవారికి దీర్ఘకాలంలో కంటి, గుండె, మూత్రపిండాలు, కొలెస్టరాల్, హైపర్‌టెన్షన్ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో రోగులు చేయాల్సిన వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవటమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ప్రజల సగటు పని సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. అందువల్ల దీనిని ఇక ఎంతమాత్రమూ వ్యక్తుల సమస్యగా చూడలేమని పేర్కొంటున్న నిపుణులు.. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని వ్యాధి నిర్ధారణ, నివారణ, వైద్య సేవలు ప్రారంభించాలని సూచిస్తున్నారు.
Read also: Cyber Crime: హైదరాబాద్ లో హైటెక్ మోసాలు.. సైబర్ నేరాల పట్ల జర ఫైలం
భారత్‌లో డయాబెటిక్ రోగులు వైద్యం, మందుల కోసం ఏటా చేస్తున్న ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారుతున్నది. ప్రత్యక్షంగా నార్త్‌జోన్‌లో ఏటా రూ.18,890 ఖర్చు చేస్తుండగా, ఇది సౌత్‌జోన్‌లో రూ.10,585 ఉన్నది. అతి తక్కువగా వెస్ట్ జోన్‌లో రూ.8,822 ఖర్చు చేస్తుండగా, నార్త్ ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా రూ.45,792 ఖర్చు చేస్తున్నారు. పరోక్షంగా నార్త్‌జోన్‌లో రూ.18,146 ఖర్చు చేస్తుండగా, సౌత్‌జోన్‌లో రూ.18,198, వెస్ట్ జోన్‌లో రూ.3,949, నార్త్ ఈస్ట్ జోన్‌లో రూ.18,707 ఖర్చు పెడుతున్నారు. వ్యాధి నిర్ధారణ, వైద్యం, వ్యాధి రాకుండా తీసుకొనే ముందస్తు చర్యలు, రోగుల కోసం తీసుకొనే ప్రత్యేక శ్రద్ధ తదితర వాటి కోసం చేసే ఖర్చును ప్రత్యక్ష ఖర్చుకింద చూపుతున్నారు. అనారోగ్యం వల్ల ఉద్యోగాలకు తరుచూ సెలవులు పెట్టడం, పని సామర్థ్యం తగ్గిపోవటం, శాశ్వత వైకల్యం వంటివి పరోక్ష వ్యయం కింద చూపుతున్నారు.
