NTV Telugu Site icon

కరోనా ఆసుపత్రి నుంచి 23 మంది రోగులు పరార్… అప్రమత్తమైన అధికారులు 

ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో అనేక ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్పులు చేశారు.  ఇందులో బడా హిందూరావ్ ఆసుపత్రి కూడా ఒకటి.  ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 250 పడకలను ఏర్పాటు చేశారు.  ఈ పడకలన్నీ కూడా కరోనా రోగులతో ఫుల్ అయ్యాయి.  ఆయితే, ఈ ఆసుపత్రి నుంచి ఏప్రిల్ 19 నుంచి మే 6 వ తేదీ వరకు 23 మంది కరోనా రోగులు పరారైయ్యారు.  దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  ఆసుపత్రిలో చెప్పకుండా వీరంతా పరారైనట్టు అధికారులు పేర్కొన్నారు.  పరారైన రోగుల కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.