New Covid Variant JN.1: భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. కోవిడ్ శాంపిళ్లను ల్యాబుల్లో పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవాలో ఈ వేరియంట్ కేసులు 19 నమోదవ్వగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల కేరళలో JN.1 వేరియంట్ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత వేగం వ్యాప్తి చెందడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Man Beheads Wife: “టీ” తీసుకురావడం ఆలస్యమైందని భార్య తలనరికిన భర్త..
మరోవైపు కేంద్రం కూడా కోవిడ్ రక్షణ చర్యల్ని ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా దేశంలో క్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలు, యూటీలకు కోవిడ్ అత్యవసర చర్యల్ని తీసుకోవాలని సూచించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమావేశం నిర్వహించారు.