CUET UG 2024: యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ చదవాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఎందుకంటే యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం అంత సులువు కాదు. కానీ అవకాసం అందిపుచ్చుకుంటే మాత్రం అక్కడ విద్యావిధానం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. అందుకే విద్యార్థులు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అలా యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ చదవాలని ఎదురు చూస్తున్న విద్యార్ధులకి శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2024 లో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET ) UG మరియు PG పరీక్షల తేదీలను ప్రకటించింది. సెషన్ 2024లో జరగనున్న UG పరీక్షలు మే 15 నుండి ప్రారంభం కానున్నాయి. కాగా PG పరీక్షలు మార్చి 11 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT ) విధానంలో నిర్వహించబడతాయి.
Read also:Khalistani Terrorists: వాళ్లు కెనడాలో కూర్చుని స్కెచ్ వేస్తే.. పంజాబ్ లో భూమి అదురుద్ది
విడుదలైన నోటీసు ప్రకారం.. CUET UG పరీక్ష 2024వ సంవత్సరం మే 15వ తేదినుండి నుండి 2024 మే 31వ తేదీవరకు వరకు నిర్వహించబడుతుంది. CUET PG పరీక్షలు 2024 మార్చి 11 నుండి మార్చి 28 వరకు నిర్వహించబడుతుంది.. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ “nta.ac.in”ని సందర్సించ వచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించ బడుతున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET ) అనేది జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. యూజీ, పీజీ కోర్సులు యూనివర్సిటీ లో చదవాలనుకున్న వాళ్ళకి ఈ పరీక్షల ద్వారా అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షలలో ఉతీర్ణత సాధించిన విద్యార్ధులకి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లో యూజీ, పీజీ కోర్సులు చదివేందుకు ప్రవేశం లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రెండు పరీక్షల కోసం లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకుంటారు.