Site icon NTV Telugu

మాతృత్వానికే మచ్చ.. కన్న బిడ్డను చిత్రహింసలు పెట్టిన తల్లి..

తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. కన్న బిడ్డను రకరకాలుగా కొట్టి చిత్రహింసలకు గురిచేసింది ఓ తల్లి.. దీంతో రెండేళ్ల ప్రదీప్‌ అనే బాలుడి పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. ఏపీలోని చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్లి చేసుకున్నాడు.. వీరికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే ఇద్దరు పిల్లలున్నారు.. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.. దానికి కారణం ఆ దంపతుల జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడమేనని తెలుస్తోంది… ప్రియుడుపై మోజుతోనే భార్య తులసి ఇలా చేసిందని వడివేలన్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.. ఇక, తులసి కోసం తమిళనాడు నుండి ప్రత్యేకంగా పోలీసులను చిత్తూరుకు పంపించింది స్టాలిన్‌ సర్కార్.

Exit mobile version