Sikh Brothers Separated During Partition, Reunite After 75 Years: 1947 భారత్ – పాకిస్తాన్ దేశవిభజన ఎన్నో చేదు గుర్తలను మిగిల్చింది. వేల సంఖ్యలో హిందూ, ముస్లిం, సిక్కులు ఊచకోతకు గురయ్యారు. చాలా కుటుంబాలను విభజన చిన్నాభిన్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని దశాబ్ధాల తర్వాత అన్నదమ్ములు, అన్నా చెల్లిళ్లు, వారి కుటుంబాలు కలుసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ లో కలుసుకున్నారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ భావోద్వేగంలో మునిగిపోయారు.
హర్యానాకు చెందిన సోదరులు గురుదేవ్ సింగ్, దయా సింగ్ హర్యానాలోని మహేంద్రనగర్ జిల్లాలోని గోమ్లా గ్రామంలో నివసించే వారు. వీరి తండ్రి చనిపోవడంతో అతని స్నేహితుడు కరీం బక్ష్ తో కలిసి నివసించే వారు. అయితే దేశవిభజన సమయంలో కరీం బక్ష్ గురదేవ్ సింగ్ తో కలిసి పాకిస్తాన్ వలస వెళ్లారు. అతని తమ్ముడు దయాసింగ్ తన మామతో కలిసి హర్యానాలోనే ఉన్నాడు. పాకిస్తాన్ లోని లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో పంజాబ్ ప్రావిన్స్ లోని ఝాంగ్ జిల్లాకు వెళ్లారు. అక్కడ గురుదేవ్ సింగ్ పేరును గులామ్ మహ్మద్ గా మార్చాడు. కొన్నేళ్ల క్రితం గురుదేవ్ సింగ్ మరణించాడు.
Read Also: Child Abuse : రైలు మిస్సై స్టేషన్లో నిద్రపోయిన తల్లీబిడ్డ.. లేచి చూసేసరికి ఘోరం
గురుదేవ్ సింగ్ కొడుకు మహ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆయన తమ్ముడు దయాసింగ్ ఆచూకీ కోసం కొన్నేళ్లుగా భారత ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారని చెప్పారు. ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా దయాసింగ్ ను కొనుక్కున్నామని చెప్పాడు. రెండు కుటుంబాలు కూడా కర్తార్ పూర్ సాహిబ్ లో కలుసుకోవానలి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. హర్యానాలోని తమ పూర్వీకుల ఇంటిని సందర్శించేందుకు వీలుగా భారత ప్రభుత్వం వీసాలు ఇవ్వాలని కోరారు.
గతేడాది కూడా ఇలాగే విభజన సమయంలో విడిపోయిన సోదరులు పాక్ కు చెందిన మహ్మద్ సిద్ధిక్(80), భారతదేశానికి చెందిన హబీబ్ (78) 2022 జనవరిలో కర్తార్ పూర్ కారిడార్ లోనే కలుసుకున్నారు. కర్తార్ పూర్ సాహిబ్ సిక్కులకు పవిత్ర స్థలం. పాకిస్తాన్ లో ఉన్న కర్తార్ పూర్ లో సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ చివరి రోజులు గడిపారు. కర్తార్ పూర్ కారిడార్ భారత్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కలుపుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కారిడార్ ను సందర్శించేందుకు భారతీయ సిక్కులకు వీసా రహిత అనుమతి ఉంది.