Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్‌లోని “ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాల”పై నిషేధం ప్రకటించిన అమిత్ షా..

Amit Shah

Amit Shah

Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు.

Read Also: Karnataka: “బీజేపీకి పాకిస్తాన్ శత్రు దేశం, మాకు కాదు”.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఈ రెండు సంస్థలపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ సంస్థలు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నాయని అమిత్ షా ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నందున జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్(జేఐ)పై కేంద్రం మంగళవారం నిషేధాన్ని మరో 5 ఏళ్లు పొడగించింది. తాజా కాశ్మీర్‌లోని రెండు సంస్థలపై బ్యాన్ ప్రకటించింది.

Exit mobile version