జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.. ఎటువంటి నష్టం జరగలేదు.. ఆదివారం తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1:37 గంటలకు ఒక భవనం పైకప్పుపై జరగా.. రెండవది.. తెల్లవారుజామున 1:42 గంటలకు నేలపై జరిగినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ రెండు పేలుళ్ల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ పేలుళ్లలో భవనం పైకప్పుకు స్వల్ప దెబ్బతిందని.. అంతకుమించి ఎలాంటి నష్టం జరగలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు భారత వైమానిక దళం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.. ఈ ప్రాంతాన్ని భద్రతా దళాలు నిమిషాల్లోనే చుట్టుముట్టాయి. రెండు పేలుళ్లకు కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆ స్థలంలో ఉన్నాయని.. వైమానిక దళం స్టేషన్ వెలుపల విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది మరియు ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నామని.. ఉగ్రవాద కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని చెబుతున్నారు.
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు..! హై అలర్ట్..

Jammu airport