Fire Accident: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అగ్నిప్రమాదంలో ఇద్దరు వైద్యులతో సహా కనీసం ఐదుగురు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు. వీరిలో వైద్య సంస్థ యజమాని డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజ్రా, మేనల్లుడు సోహన్ ఖమారి, ఇంటి పనిమనిషి తారా దేవి ఉన్నట్లు సమాచారం.
Read also: Avinash Reddy: వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
రాంచీకి 170 కిలోమీటర్ల దూరంలోని ధన్‌బాద్‌లోని బ్యాంక్ మోర్ ప్రాంతంలోని నర్సింగ్ హోమ్-కమ్-ప్రైవేట్ హౌస్ స్టోర్ రూమ్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ధన్‌బాద్ డీఎస్పీ అర్వింద్ కుమార్ బిన్హా మాట్లాడుతూ, స్టోర్ రూమ్‌లో మంటలు రావడంతో ఊపిరాడక యజమాని, అతని భార్యతో సహా ఐదుగురు మరణించారని.. మరో వ్యక్తి గాయపడ్డాడని వెల్లడించారు. మంటలు ఎలా వ్యాపించాయనేది ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అయితే అదుపులోకి వచ్చాయని అన్నారు. అయితే నలుగురి మృతదేహాలను గుర్తించామని, ఐదో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.