Site icon NTV Telugu

Home Theatre Explodes: హోం థియేటర్ పేలుడు.. పెళ్లి కొడుకుతో పాటు మరొకరి మృతి..

Home Theatre Explodes

Home Theatre Explodes

Home Theatre Explodes: పెళ్లిలో పెట్టిన గిఫ్టులు ఆశగా ఓపెన్ చేస్తే అది కాస్త పేలి పెళ్లి కొడుకుతో పాటు మరొకరు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న వ్యక్తి హోం థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ గిప్టుగా వచ్చింది. పెళ్లయిన వ్యక్తి, అతడి అన్నయ్య హోం థియేటర్ ఓపెన్ చేసి వైర్‌ను ఎలక్ట్రిక్ బోర్డ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఆన్ చేయగా, భారీ పేలుడు సంభవించింది.

Read Also: Waltair Railway Division: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యేక గుర్తింపు.. వాల్తేరు డివిజన్‌ రికార్డు..

ఈ పేలుడు ధాటికి హేమేంద్ర మెరావి (22) అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతడికి ఏప్రిల్ 1న వివాహం జరిగింది. పేలుదు ప్రభావంతో గది గోడులు, పై కప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ సరిహద్దులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంది.

సోమవారం, పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులు తన ఇంట్లో పెళ్లి గిప్టులు విప్పుతున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు కబీర్ ధామ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ తెలిపారు. పెళ్లికొడుకు మెరావితో పాటు అతడి సోదరుడు (30) మరణించాడు. ఏడాదిన్నర బాలుడితో పాటు మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కవ్రాధా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అప్రమత్తం అయిన ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే పేలుడుకు కారణం అయ్యే మండే వస్తువులు గదిలో కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. గదిలో పేలింది మ్యూజిక్ సిస్టమ్ మాత్రమే అని, దానికి కారణాలు తేలియాల్సి ఉందని వారు వెల్లడించారు.

Exit mobile version