NTV Telugu Site icon

క‌రెంట్ పోయింది.. క‌రోనా రోగులు మృతి..

power supply

విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌రోనా రోగుల ప్రాణాలు తీసిన ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌ను పూనుకుంటోంది.. బెడ్ల కొర‌త‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది.. అయినా.. క్ర‌మంగా అక్క‌డ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మృతుల సంఖ్య కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది.. తాజాగా, గోరఖ్‌పూర్‌లోని ఆరుహి ఆస్పత్రి అండ్ ట్రామా సెంటర్‌లో చికిత్స సమయంలో వెంటిలేటర్‌పై ఇద్దరు కోవిడ్ రోగులు మృతిచెందారు.. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న స‌ర్కార్.. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.. అయితే, ఈ నెల‌ 10న విద్యుత్తు కోత సమయంలో కొంతమంది జనరేటర్‌పై రాళ్లు రువ్వారని, దీంతో.. జనరేటర్ పనిచేయడం ఆగిపోయింద‌ని.. ఇదే క‌రోనా రోగుల మ‌ర‌ణానికి కార‌ణంగా చెబుతోంది ఆసుపత్రి యాజమాన్యం.