NTV Telugu Site icon

Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.

Madhya Pradesh Incident

Madhya Pradesh Incident

2 Congress MLAs booked for harassing woman: బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులే వేధింపులకు పాల్పడ్డారు. మహిళ అని కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారు. రైలులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యంమత్తులో రైలులో హడావుడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ మహిళ పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. రైలుతో చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న మహిళను వేధించారు.

Read Also: Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..

ఈ ఆరోపణలపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను సత్నా ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుష్వాహా, కోత్మా ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ గా గుర్తించారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 354( మహిళ గౌరవాన్ని కించపరచడం, ఉద్దేశపూర్వకంగా దాడి, బలప్రయోగం) కింద కేసు నమోదు చేశారు. సాగర్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు అయింది.

ఇద్దరు ఎమ్మెల్యేలు గురువారం రేవాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. మద్యం మత్తులో కట్నీ స్టేషన్ లో వీరు రైలులోకి ఎక్కారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడ్డారు. తన భర్తకు ఫోన్ చేసి సదరు మహిళ అప్రమత్తం చేసింది. దీంతో భర్త రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే పోలీసులకు వేధింపుల గురించి ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేపై రైల్వే పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీరిద్దరిపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

Show comments