కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు కన్నుమూశారు.. ఉధంపూర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయజనం లేకుండా పోయింది.. అప్పటికే ఆ ఇద్దరు పైలట్లు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తుక్కుతుక్కయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీసి.. మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్‌ను ఆస్పత్రికి తరలించారు.. మేం వారిని ఆసుపత్రికి తరలించాం.. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని ఓ సీనియర్ ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.. మేజర్ రోహిత్ కుమార్ మరియు మేజర్ అనూజ్ రాజ్‌పుత్ “21 సెప్టెంబర్ 2021 న పట్నిటాప్‌లో విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు ఇండియన్ ఆర్మీ.
Also Read
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
-
Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!