NTV Telugu Site icon

Uttarakhand: ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు.. 24 గంటల్లో 19 మంది మృతి

Uttharakhand

Uttharakhand

ఉత్తరాఖండ్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని బలి తీసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 19 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు మూడు కార్లు పౌరీలో లోతైన లోయలో పడిపోయాయి. కాగా, శనివారం రుద్రప్రయాగ్‌లోని అలకనంద నదిలో టెంపో ట్రావెలర్ పడిపోవడంతో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. హల్ద్వానీలో కూడా ఓ కారు లోతైన లోయలో పడిపోవడంతో ఒకే కుటుంబంలోని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

BJP: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో బీజేపీ నేతల సీక్రెట్ సమావేశం..ఎజెండా ఏంటి?

అయితే.. ఈ ప్రమాదాలకు గల కారణం.. కొండలపై అతివేగంతో పాటు డ్రైవర్లు నిద్రపోవడం వల్లనే అని నిపుణులు చెబుతున్నారు. డ్రైవర్ కొద్దిపాటి అజాగ్రత్త వహిస్తే.. ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పూరీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో.. టాక్సీ సహా రెండు ప్రైవేట్ కార్లు కాలువలో పడిపోయాయి. మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఆ తరువాత.. ఖిర్సు-కతులి లింక్ మోటార్‌వేపై వివాహ కారు ప్రమాదానికి గురై లోతైన కాలువలో పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. మరో ఘటన.. సత్పులిలోని దంగ్లేశ్వర్ మహాదేవ్ దేవాలయం సమీపంలో రెట్‌పూర్ నుంచి సత్పులి వైపు వెళ్తున్న ఆల్టో కారు అదుపు తప్పి 100 మీటర్ల దూరంలో ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.

Bhairava Anthem: మరి కొద్దీ గంటల్లో భైరవ గీతం.. ప్రభాస్ ఫ్యాన్స్ బి రెడీ..

ప్రమాదాలపై పురి డీఎం డాక్టర్ ఆశిష్ చౌహాన్ విచారం వ్యక్తం చేస్తూ ప్రమాదాలపై సమీక్షిస్తామన్నారు. రోడ్డు భద్రతపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో శనివారం ఉదయం టెంపో ట్రావెలర్‌ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్‌లో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. టెంపో ట్రావెలర్ నదిలో పడి 14 మంది పర్యాటకులు మృతి చెందగా, 12 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఢిల్లీ, నోయిడా తదితర నగరాల నుంచి ఉత్తరాఖండ్‌లోని చోప్తాకు సందర్శనార్థం వెళ్తున్న పర్యాటకులు ఉన్నారు. గాయపడిన వారిని ఎయిర్‌ లిఫ్టు చేసి రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శనివారం సాయంత్రం బెరినాగ్ నుంచి హల్ద్వానీకి వెళ్తున్న ఓ కుటుంబం కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో అల్మోరా జిల్లాలోని భత్రౌంజ్‌ఖాన్ సమీపంలో 500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను రక్షించి రామ్‌నగర్ ఆసుపత్రికి, ఆపై హల్ద్వానీకి తరలించారు.