NTV Telugu Site icon

Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..

Delhi

Delhi

Dense Fog: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీని పొగ మంచు కప్పేయడంతో.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం నమోదు అవుతున్నాయి. ఈరోజు (జనవరి 15) తెల్లవారుజామున విజిబిలిటీ జీరోకు పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా దాదాపు 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Army Day 2025: ఆర్మీ పదవుల్లో ఉన్న భారత క్రీడాకారులు ఎవరో తెలుసా?

అలాగే, మరో​ ఏడు విమానాలను రద్దు చేసినట్టు కేంద్ర పౌర విమానయాన అధికారులు తెలిపారు. ఇక, రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో 6 రైలు సర్వీసులను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. మరోవైపు, ఢిల్లీలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలోకి వెళ్లింది. దీంతో, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో సఫర్జజ్‌గుంజ్‌లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీలుగా నమోదైంది. దీంతో, ప్రజలు చలితో వణికిపోతున్నారు.

Show comments