జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని గత కొంత కాలంగా కాశ్మీరి హిందువులు నిరసన, ఆందోళను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తడి పెరిగింది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీర పండిట్ ఉపాధ్యాయులను శ్రీనగర్ నగరానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను టార్గెట్ చేస్తు ఉగ్రవాదులు చంపుతుండటంతోె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాశ్మీర్ విద్యాశాక 177 మంది కాశ్మీర్ పండిట్ టీచర్ల జాబితాను బహిరంగపరిచింది.దీంట్లో టీచర్ల పేర్లు వారు బదిలీ చేయబడిని పాఠశాల వివరాలు కూడా ఉండటంతో మరోసారి వీరి భద్రతకు భగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
శుక్రవారం అమిత్ షాతో హైలెవల్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో వరసగా టార్గెటెడ్ కిల్లింగ్ జరగడంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.
మే 12న బుద్గామ్ లో చదూరా తాహసీల్ ఆఫీస్ లో పని చేస్తున్న రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆ తర్వాత నుంచి వరసగా లక్ష్యిత దాడులు జరగుతున్నాయి. ఇటీవల కాశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలు, ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.