166 Criminals Killed In Encounters In Last 5 Years, Says Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరాలకు పాల్పడే వారి ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూలగొట్టి నేరస్తుల్లో భయాన్ని పుట్టిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో యూపీలో పేరుకు పోయిన నేరాలను, మాఫియాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ కౌంటర్లతో నేరస్తులను ఎలిమినేట్ చేస్తోంది యోగి సర్కార్.
ఇదిలా ఉంటే గత ఐదేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం అని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. 4,453 మంది గాయపడ్డారని ఆయన శుక్రవారం అన్నారు. నేరాలపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. 2017-2022 మధ్య 13 మంది పోలీసులు కూడా మరణించారని.. వెయ్యి మంది పైగా గాయపడ్డారని తెలిపారు. లక్నోలో జరిగిన రిజర్వ్ పోలీస్ లైన్స్ లో జరిగిన పోలీస్ మోమోరియల్ డే పరేడ్ లో ఆయన ప్రసంగించారు.
Read Also: Jharkhand:సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం.. సిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం
అమవీరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. వారి సంక్షేమం, అవసరాలు తీర్చేందుకు హామీ ఇస్తున్నాని వెల్లడించారు. పోలీస్ సిబ్బందికి మోటార్ సైకిత్ భత్యం రూ. 500 ప్రకటించారు. గత ప్రభుత్వాలు దీని కోసం రూ. 200 చెల్లించేవి. పోలీసులు ఫోన్ అలవెన్స్ సంవత్సరానికి రూ. 2000 అదనంగా చెల్లించుతోంది ప్రభుత్వం. రూ. 5 లక్షల వరకు మెడికల్ బిల్లలను డీజీపి క్లియర్ చేస్తారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
2019 కుంభమేళా, 2022 అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసులను అభినందించారు సీఎం. కోవిడ్ సమయంలో పోలీసుల కృషి ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. 22,000 మంది మహిళలతో పాటు మొత్తం 1,50,231 మంది అభ్యర్థులను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు రిక్రూట్ చేసుకున్నారని.. 45,689 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. 2017-18లో పోలీస్ బడ్జెట్ రూ. 16,115 కోట్లు కాగా.. 2021-22 నాటికి అది రూ.30,203 కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. 244 కొత్త పోలీస్ స్టేషన్లు,133 అవుట్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.