Site icon NTV Telugu

Domestic Violence: చెన్నైలో పారిశ్రామికవేత్త ఇంట్లో 16 ఏళ్ల బాలిక మృతి.. ఆరుగురు అరెస్ట్!

Tn

Tn

Domestic Violence: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక హత్య కేసులో పారిశ్రామికవేత్త ఆయన భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాత కార్ల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్త మహమ్మద్ నిషాద్.. గత ఏడాదిగా చెన్నై అమింజికరైలోని ఆయన ఇంటిలో పని చేస్తున్న తంజావూరుకు చెందిన 16 ఏళ్ళు బాలిక.. ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని బాలికను భార్యభర్తలు ఇద్దరు చిత్రహింసలకు గురి చేశారు.

Read Also: Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..

అయితే, దీపావళి రోజున బాలికకు ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టి, సిగరెట్ తో కాల్చి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా కొట్టారు ఆ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు. అయితే, వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక బాలిక మృతి చెందింది. భయంతో బాలికను బాత్ రూంలో పడేసి పారిశ్రామికవేత్త కుటుంబం పరారీ అయింది. ఇక, బాలిక కోసం అక్కడికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పారిశ్రామిక వేత్త ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version