కర్ణాటకలోని హోసూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బంజరు పొలాల్లో బాలిక ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఒక స్త్రీ, పురుషుడు ఉన్న కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో తెగవైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: TS SSC Hall Ticket 2025: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్
బాలిక (14) తమిళనాడులోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ గ్రామానికి చెందింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదవింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. అయితే బాలిక కుటుంబ సభ్యులు.. మార్చి 3న కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29) అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ వివాహం బెంగళూరులో జరిగింది. అయితే ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయినా ఆమె బాధను ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత బాలిక తిమ్మత్తూరుకు వచ్చింది. అయితే తిరిగి అత్తమామల ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే బాలిక భర్త మాదేష్, మాదేష్ అన్నయ్య మల్లేష్ (38) బలవంతంగా బాలికను కాలికుట్టై గ్రామానికి తీసుకెళ్లారు. అయితే ఈ దృశ్యాలను పలువురు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. డెంకనికోట్టై పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేపట్టింది. బాలిక అమ్మమ్మ కూడా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం మాదేష్, అతని సోదరుడు మల్లేష్, అమ్మాయి తల్లి నాగమ్మను అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున మరో ఇద్దరని అరెస్ట్ చేశారు, అమ్మాయి తండ్రి, మల్లేష్ భార్యను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై POCSO (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) మరియు బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారందరికీ రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Chhaava Review : విక్కీ కౌశల్ – రష్మిక’ల చావా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?