Site icon NTV Telugu

Kolkata: హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 14 మంది మృతి

Kolkatahotelfire

Kolkatahotelfire

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఒక హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం 14 మృతదేహాలను వెలికితీసినట్లుగా వెల్లడించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ram Charan : పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనేది అప్పుడే..

ఇక ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా అగ్నిమాపక శాఖ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులకు మంచి చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన మృతులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి: DC vs KKR: ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. ఢిల్లీపై కోల్‌కతా ఉత్కంఠ విజయం

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ స్పందిస్తూ.. కోల్‌కతా కార్పొరేషన్‌ తీరును తప్పుపట్టారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్పొరేషన్ ఏం చేస్తుందని నిలదీశారు.

 

Exit mobile version