Delhi airport bomb scare: సరదా కోసం ఇలా చేస్తారా.. విమానంలో బాంబు ఉందని 13 ఏళ్ల బాలుడి బెదిరింపు..
- దుబాయ్‌కి వెళ్లే ఫ్లైట్‌లో బాంబు ఉందని నకిలీ బెదిరింపు..
- సరదా కోసం ఈమెయిల్ పంపిన 13 ఏళ్ల బాలుడు..
- ఉత్తరాఖండ్‌లో 9వ తరగతి చదవుతున్న బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi airport bomb scare: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకి నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. విమానంలో బాంబు పెట్టి పేల్చేస్తాంటూ ఈమెయిల్స్, అగంతకుల నుంచి ఫోన్స్ రావడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీనేజ్ మైనర్ బాలురు కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. తాజాగా 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు సరదా కోసం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.
Read Also: Himanta Biswa Sarma: బంగ్లాకి చెందిన మైనారిటీలు కాంగ్రెస్‌కి ఓటేశారు.. హిందువులు..
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
బాలుడు ఉత్తరాఖండ్‌కి చెందినవాడిగా అధికారులు గుర్తించారు. దుబాయ్ వెళ్లే విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ పంపిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(ఐజీఐ ఎయిర్‌పోర్టు) ఉషా రంగనాని ప్రకారం.. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన 13 ఏళ్ల బాలుడు ఇలాగే బెదిరించడం చూసి తాను కూడా ఇదే పనిని చేసినట్లు బాలుడు చెప్పినట్లు తెలిపారు. జూన్ 17న ఢిల్లీ విమానాశ్రయానికి జూన్ 18న దుబాయ్‌కి వెళ్లాల్సిన విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇది బూటకమని తేలింది.
సంబంధిత ఈమెయిల్ ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఈమెయిల్ పంపడానికి స్కూల్ వర్క్ కోసం ఉపయోగించే మొబైల్ వాడాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడినట్లు బాలుడు తెలిపాడు. ఈమెయిల్ లింక్ చేసిన ఫోన్‌ని అధికారులు స్వాధీనం చేసుకుని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో కెనడా టొరంటోకి వెళ్తున్న విమానంలో బాంబు ఉందని మీరట్‌కి చెందిన 13 ఏళ్ల బాలుడు ఈమెయిల్ పంపాడు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి