Site icon NTV Telugu

AAP: ఆప్‌‌లో కలకలం.. 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ప్రకటన

Aap

Aap

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో ఝలక్ తగిలింది. 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఆప్‌కు రాజీనామా చేశారు. తిరుగుబాటు కౌన్సిలర్లంతా కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ముఖేష్ గోయెల్ నాయకత్వంలో ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ పేరు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: కాంగ్రెస్ 4 పేర్లు సూచించింది..అయినా శశిథరూర్‌కే మోడీ ఓటు..

రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో.. ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు. గత మున్సిపల్‌ ఎన్నికలకు ముందు వీరంతా కాంగ్రెస్‌ను వీడి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోయెల్ ఆదర్శ్ నగర్ నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 25 ఏళ్లుగా మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేసిన గోయెల్‌.. 2021లో కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. మరోవైపు మూడు నెలల క్రితమే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనితా బసోయ, నిఖిల్‌ చప్రానా, ధరమ్‌వీర్ బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Vijay Deverakonda:ఫిలింఫేర్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తదితర కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. బీజేపీ ఘనవిజయం సాధించింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Exit mobile version