Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో కూలిన భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు బాలికలతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కొత్తగా నిర్మించిన భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది. ఇప్పటి వరకు 12 మందిని రక్షించామని, శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela 2025: గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లో ఇటీవల నిర్మించిన భవనం సోమవారం సాయంత్రం 7 గంటలకు కూలిపోయినట్లు తెలిపారు. నిర్మాణాలు బలహీనత కారణంగానే కూలిపోయినట్లు నార్త్ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజా బాంథియా అన్నారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. బాధితులకు సాయం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు. బురారీకి చెందిన ఎమ్మెల్యే సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఫ్రీగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్!.. ఎలా అంటే?

Exit mobile version