NTV Telugu Site icon

NDA: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే..

Nda

Nda

NDA: పార్లమెంట్ రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ రోజు మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది, కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.

Read Also: Kolkata Doctor Murder: ‘రేపు బంద్ లేదు.. అందరూ ఆఫీసుకు రావాల్సిందే’.. ప్రభుత్వం అల్టిమేటం

మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీకి చెందినవారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో మొత్తం స్థానాలు 245. ప్రస్తుతం 8 ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 04 ఉండగా, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్ష నాయకుడి హోదాని దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి.